Updated : 06 Jul 2022 08:56 IST

Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా

కరప, న్యూస్‌టుడే: ‘జెండా మోసిన కార్యకర్తలే శాశ్వతం. వారిదే వైకాపా. నాయకులది కాదు...’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రాకతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందని, మనం పెట్టిన వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారని, మనమేమీ చేయలేకపోతున్నామంటూ పార్టీలోని నాయకులు అసంతృప్తికి గురవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వాలంటీర్లను మనమే పెట్టామని, కార్యకర్తలకు నచ్చకపోయినా, ఎవరైనా సరిగా పని చేయకపోయినా తీసేయండని సూచించారు. గ్రామ కార్యదర్శులను అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలం నడకుదురులో మంగళవారం నిర్వహించిన కాకినాడ జిల్లా వైకాపా ప్లీనరీలో మంత్రి రాజా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts