పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయండి

నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అనిశా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ

Published : 06 Jul 2022 05:44 IST

అనిశాకు హైకోర్టు నోటీసులు

ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాజ్యంపై విచారణ

ఈనాడు, అమరావతి: నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అనిశా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని అనిశాకు నోటీసులిచ్చింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నాలుగు వారాలు సమయం కావాలని అనిశా చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని