పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి: సీఎం జగన్‌

పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సులభతర వాణిజ్య విభాగంలో 97.89

Published : 06 Jul 2022 05:44 IST

ఈనాడు, అమరావతి: పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సులభతర వాణిజ్య విభాగంలో 97.89 శాతంతో దేశంలోనే మొదటి స్థానం సాధించడం వెనుక అధికారుల కృషి ఉందన్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్‌ వళవన్‌, ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ సుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన, వస్త్ర విభాగం (చేనేత) ముఖ్య కార్యదర్శి సునీత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సులభతర వాణిజ్య విభాగంలో వరుసగా రెండో ఏడాది రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 15 రంగాల్లో 301 సంస్కరణ ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా కేంద్రం ర్యాంకులు ప్రకటించింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని