రూ.18 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు!
పోలవరం భూసేకరణ పరిహారం పంపిణీలో న్యాయస్థానాల ఆదేశాలూ బేఖాతరు
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ కాలువ కోసం చేపట్టిన భూసేకరణలో వివాదాల్లో ఉన్న భూములపై ఒకరిద్దరు అధికారులు లబ్ధి పొంది కొందరికి పరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలనూ పక్కనబెట్టి కావాల్సిన వారికి చెల్లింపులు జరపడంతో కలెక్టరు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రాజెక్టువల్ల ముంపును ఎదుర్కోనుందని దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆరు దశల్లో 1,273 ఎకరాలకుపైగా భూమి సేకరించారు. ఇందులో దాదాపు 426 ఎకరాల భూమిపై హక్కులకు సంబంధించిన వివాదాలున్నాయి. వీటిపై కొన్ని కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్నాయి. కొందరు హైకోర్టునూ ఆశ్రయించారు. ‘వివాదాలు తేలేవరకు ఆ భూముల పరిహారం ఎవరికీ చెందకుండా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని కోర్టుకు విన్నవించారు. వీరికి అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. పైగా.. భూముల అవార్డుకు సంబంధించి వివాదాలుంటే భూసేకరణ చట్టం సెక్షన్ 77(2) ప్రకారం వాటి పరిహారాన్ని సంబంధిత అథారిటీవద్ద జమ చేయాల్సి ఉంటుంది. వివాదం పరిష్కారమయ్యాక పంపిణీ చేయాలి. ఇలా చూసుకున్నా కొండమొదలులో 426 ఎకరాలకు సంబంధించిన దాదాపు రూ.25 కోట్లను విశాఖలోని అథారిటీవద్ద డిపాజిట్ చేయాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు ఆ పని చేయలేదు. ఆ మొత్తం భూసేకరణ కలెక్టరుకు సంబంధించిన ఖాతాలో వేశారు. చాలాకాలం అందులోనే ఉంచారు. ఇంతలో ఈ వివాదాల్లోని భాగస్వాములు ఒక ఉన్నతాధికారిని సంప్రదించినట్లు సమాచారం. దీంతో అందులోని దాదాపు రూ.18కోట్ల వరకు కొందరి పేరున చెక్కులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపుల్లో ఒకరిద్దరు అధికారులు పెద్ద ఎత్తున లాభపడినట్లు సమాచారం. దాదాపు 300 ఎకరాలకుపైగా వివాదాస్పద భూములకు అధికారులు ప్రత్యేక ప్రయోజనాలు పొంది చెల్లింపులు జరిపారనేది ప్రధాన ఆరోపణ. దీంతో తాము నష్టపోయామని ఇతర హక్కుదారులు జిల్లా కలెక్టరుకు, ప్రత్యేకాధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఫిర్యాదులు చేశారు. ప్రత్యేకాధికారి అధికారులను పిలిచి వివరణ కోరారు. ఆ తర్వాత పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలకంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఉత్తరాంధ్రకు వాయు‘గండం’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
-
Politics News
KTR: కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్
-
Sports News
INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
-
India News
ISRO: SSLV ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు..
-
Sports News
CWG 2022: పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు స్వర్ణం-రజతం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం