ఒప్పంద అధ్యాపకుల వేతనాల పెంపు

విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల గౌరవ వేతనాలను పెంచేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ, ఏఐసీటీఈ ప్రకారం అర్హతలు

Updated : 07 Jul 2022 07:08 IST

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల గౌరవ వేతనాలను పెంచేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ, ఏఐసీటీఈ ప్రకారం అర్హతలు ఉన్న వారికి నెలకు రూ.35వేలు, పీహెచ్‌డీ ఉంటే అది పూర్తి చేసినప్పటి నుంచి నెలకు రూ.5వేలు అదనంగా ఇస్తారు. నెట్‌, స్లెట్‌ లేకుండా పీజీ, పీహెచ్‌డీ ఉంటే మాత్రం రూ.5వేలు ఇవ్వరు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున ఇంక్రిమెంట్‌ ఇస్తారు. దీన్ని ప్రాథమిక వేతనం రూ.35వేలకు మాత్రమే కలుపుతారు. ఇక నుంచి ఉద్యోగి పని తీరును సమీక్షించిన తర్వాతే ఇంక్రిమెంట్‌ ఇస్తారు. ఒప్పంద బోధన సిబ్బందికి ఇచ్చే మొత్తం సహాయ ఆచార్యుల యూజీసీ మినిమం టైంస్కేల్‌ను మించకూడదని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. వర్సిటీల్లో పనిచేసే ఒప్పంద బోధన సిబ్బందికి మినిమం టైం స్కేలు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తూతూమంత్రంగా వేతనాలు పెంచిందని ఒప్పంద అధ్యాపకులు విమర్శిస్తున్నారు. మినిమం టైం స్కేల్‌ అమలుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు సైతం ఇచ్చిందన్నారు.

బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు: విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి 11వ పీఆర్సీ అమలుకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2015 పేస్కేల్‌ తీసుకుంటున్న వారికి కొత్త పీఆర్సీ వర్తింపజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని