వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు
డిస్కంల డీలైసెన్సింగ్‌పైనా..
రాష్ట్రాల వ్యతిరేకతతో కఠిన నిబంధనల తొలగింపు
బిల్లు ముసాయిదా సిద్ధం.. ఈ నెలలోనే పార్లమెంటుకు!
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్ నిబంధననూ పక్కన పెట్టింది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో గతేడాది రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సవరించిన విద్యుత్ బిల్లును ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్ర విద్యుత్‌శాఖ కసరత్తు చేస్తోంది.
ఇవీ మార్పులు..
* విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్ నిబంధనను తొలగించింది. ఈ క్రమంలో ఒక డిస్కం పరిధిలో మరో ప్రైవేటు సంస్థకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఒక ప్రాంతంలో కరెంటు పంపిణీకి ఒక డిస్కం ఉన్నా కొత్తగా లైసెన్సు పొందే సంస్థకు సొంతంగా ‘విద్యుత్ పంపిణీ వ్యవస్థ’ ఉండాలనే నిబంధననూ కేంద్రం తాజాగా తొలగించింది. ఇప్పటికే ఉన్న ప్రైవేటు డిస్కంలు యథావిధిగా కొనసాగుతాయి.
* ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంస్థలకు విద్యుత్ పంపిణీకి లైసెన్సులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ‘క్రాస్ సబ్సిడీ నిధి’ని ఏర్పాటుచేయాలి.
* ఇతర దేశాలకు కరెంటు అమ్ముకోవచ్చనే నిబంధనను సైతం ముసాయిదాలో తొలగించారు.
* హైకోర్టు న్యాయమూరి ఛైర్మన్‌గా ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటుచేసి రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిని నియమించాలనే నిబంధనను తొలగించారు. ఒకవేళ రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిలో ఛైర్మన్, సభ్యుల పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచితే ఆ రాష్ట్ర ఈఆర్‌సీ బాధ్యతలను పక్క రాష్ట్రాల ఈఆర్‌సీకి అప్పగించే అధికారం కేంద్రానికి కల్పిస్తూ నిబంధన పెట్టారు.
* ఏటా కరెంటు ఛార్జీల సవరణకు డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఛార్జీలు సవరించే అధికారాన్ని ఈఆర్‌సీకి కల్పిస్తూ తొలుత పెట్టిన నిబంధనను తొలగించారు. ఛార్జీల పెంపును ఈఆర్‌సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ఈఆర్‌సీకి సాధారణ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.
మెగావాట్‌కు పైగా వాడేవారికి...
* రోజుకు మెగావాట్‌కు పైగా కరెంటు వాడుకునే వినియోగదారులు వారికి కనెక్షన్ ఇచ్చిన డిస్కం నుంచే కాకుండా బహిరంగ మార్కెట్‌లో, అవసరమైతే ఇతర రాష్ట్రాల విద్యుత్కేంద్రాల నుంచి సైతం కరెంటు కొనుక్కోవచ్చు. దాన్ని సరఫరా చేసినందుకు ఆ ఛార్జీలను మాత్రమే కనెక్షన్ ఇచ్చిన డిస్కం వసూలు చేయాలి. ఇలా బహిరంగ మార్కెట్‌లో కొనడాన్ని ‘ఓపెన్ యాక్సిస్’ అని పిలుస్తారు. ఇలా కొనేవారిని ఎవరూ అడ్డుకోకూడదు.
* ఒక ప్రాంతంలో ఒక డిస్కం కాకుండా పలు పంపిణీ సంస్థలు కరెంటు సరఫరా చేస్తుంటే ఛార్జీ ఎంత వసూలు చేయాలనే విషయంలో ‘గరిష్ఠ, కనిష్ఠ ఛార్జీ’లను రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించాలి. కరెంటు ఛార్జీలు పెంచాలని లేదా తగ్గించాలని డిస్కంలు ప్రతిపాదనలిస్తే వాటిపై ఈఆర్‌సీ విచారణ జరిపి తీర్పు చెప్పాల్సిన గడువును 120 నుంచి 90 రోజులకు తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు.
* విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారి నుంచి జరిమానా వసూలును తప్పనిసరి చేయాలి..
* జల విద్యుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు త్వరగా ఇవ్వాలి.. సంప్రదాయేయత ఇంధనం(ఆర్‌ఈ) ఉత్పత్తికి ఎవరు ముందుకొచ్చినా ప్రోత్సహించాలి. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కొనాలి. లేకుంటే జరిమానా చెల్లించాలి.
* విద్యుత్ వినియోగదారుల హక్కులను డిస్కంలు కాపాడుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్ర ఈఆర్‌సీ తప్పనిసరిగా ఒక విభాగాన్ని నియమించాలి.
* ఇంటిపై లేదా సొంత అవసరాలకు సౌర విద్యుత్ వంటి ఆర్‌ఈని ఏర్పాటుచేసుకుని వాడుకోగా మిగిలిన కరెంటును విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేసేవారిని ‘ప్రొస్యూమర్’ అని పిలుస్తారు. వీరి సమస్యలు, హక్కులను కాపాడేందుకు ఈఆర్‌సీ ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Parrot: ‘ఆ చిలుక నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది’.. పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
-
World News
Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
-
Sports News
IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Indain Navy: భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్ ‘డోర్నియర్’
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’