ఉన్నతీకరించిన బడుల్లో ఉత్తుత్తి కళాశాలలు!

అధ్యాపకులు, భవనాలు, ప్రయోగశాలలు లేకుండానే విద్యాశాఖ 292 మండలాల్లో బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రారంభిస్తోంది. ఉన్నత పాఠశాలల్లోనే వీటిని ఏర్పాటు చేసి అక్కడి

Published : 07 Jul 2022 04:57 IST

అధ్యాపకులు, ప్రయోగ శాలలు లేకుండానే ఏర్పాటు

ఈనాడు, అమరావతి: అధ్యాపకులు, భవనాలు, ప్రయోగశాలలు లేకుండానే విద్యాశాఖ 292 మండలాల్లో బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రారంభిస్తోంది. ఉన్నత పాఠశాలల్లోనే వీటిని ఏర్పాటు చేసి అక్కడి స్కూల్‌ అసిస్టెంట్లతోనే పాఠాలు చెప్పించాలని సూచించింది. ప్రయోగ శాలలు లేకపోతే సమీపంలోని ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని వాటిని వినియోగించుకోవాలని పేర్కొంది. ఇప్పటికే 331 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్‌కు ఉన్నతీకరించారు. ఇవికాకుండా మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలున్న 13చోట్ల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు ఉంటాయి. ప్రాథమికంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే ప్రవేశాలు నిర్వహిస్తారు. ఉన్నతీకరించిన బడుల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులకు అందులో ఏర్పాటైన కళాశాలల్లోనే  ప్రవేశాలు కల్పిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని