పోలవరం స్పిల్‌వే గేట్ల ఎత్తివేత

వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 26 మీటర్లకు పెరిగింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం

Published : 07 Jul 2022 04:57 IST

వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 26 మీటర్లకు పెరిగింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం నీటిమట్టం మరింత పెరిగితే మిగిలిన 24 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని జల వనరులశాఖ అధికారులు తెలిపారు. గతేడాది జూన్‌ 25న క్రస్టుగేట్లను ఎత్తారు.

- న్యూస్‌టుడే, పోలవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని