Published : 07 Jul 2022 04:57 IST

సంక్షిప్త వార్తలు

సీనియర్‌ ఇంజినీర్లలో అసంతృప్తి సెగలు

14న విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయం

ఈనాడు, అమరావతి: జల వనరులశాఖలో తాజాగా చోటు చేసుకున్న ఇంజినీర్ల బదిలీలు, అదనపు బాధ్యతల అప్పగింత వ్యవహారంపై సీనియరు ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విజయవాడలో జులై 14న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాల వేదికగా సన్నాహాలు చేస్తున్నారు. 1990 పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా జల వనరులశాఖలో ఇంజినీరింగ్‌ పోస్టులకు ఎంపికైనవారు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ప్రస్తుత బదిలీల్లో 2004, 2005, 2007 బ్యాచ్‌ ఇంజినీర్లకు వివిధ పోస్టుల్లో జల వనరులశాఖ అధికారులు అదనపు బాధ్యతలను అప్పగించారు. 1990లో ఎంపికైన తమను కాదని జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించడంపై సీనియర్‌ ఇంజినీర్లు అసంతృప్తిగా ఉన్నారు. తమకన్నా 15 ఏళ్ల జూనియర్ల కింద పని చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇన్‌ఛార్జి పోస్టుల్లో పని చేసేందుకు సిద్ధమేనని తెలియజేయాలని సీనియర్లు కొందరు ప్రయత్నిస్తున్నారు. తమ ఇతర సహచరులను కదిలించే సన్నాహాలు చేస్తున్నారు.


నేటి నుంచి సదరం స్లాట్‌ బుకింగ్‌

ఈనాడు, అమరావతి: సదరం శిబిరాల ద్వారా అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కోసం స్లాట్‌ బుకింగ్‌ గురువారం నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు నెలాఖరు వరకు తేదీలు అందుబాటులో ఉంచినట్లు వైద్య విధాన పరిషత్‌ అధికారులు తెలిపారు.


పోలవరం పరిహారం అక్రమాల కేసులో.. అధికారుల అరెస్టు

రంపచోడవరం, న్యూస్‌టుడే: పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాల కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది. ఇప్పటికే దేవీపట్నం తహసీల్దారు వీర్రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా బుధవారం ఆర్‌ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్‌, సర్వేయర్‌ లక్ష్మణ్‌లను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ కలెక్టర్‌ మురళి, విశ్రాంత స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామోజిలను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం వీరు రంపచోడవరం పోలీసుస్టేషన్‌లో ఉన్నారు. వీరితోపాటు రెవెన్యూ అధికారులు, దళారీలు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొంత మందిని గురువారం కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని