Family Doctor: వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’

రాష్ట్రంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని అమలు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు.

Updated : 15 Aug 2022 15:48 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని అమలు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘గ్రామాలకు వెళ్లే వైద్యులవద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుంది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలకు అనుబంధంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం అమలవుతుంది. సీజనల్‌ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవసరం. వ్యాధులవల్ల మరణాలు సంభవించకూడదు. ఒకవేళ ఎక్కడైనా నమోదైతే అక్కడి అధికారులపై చర్యలుంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరిచేలా ఫాగింగ్‌ చర్యలు ఉండాలి. దోమ తెరల పంపిణీకి చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి రజిని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని