PM Modi: క్రాంతి కుమార్‌ బాగున్నారా?.. అల్లూరి జిల్లా వాసితో మాట్లాడిన ప్రధాని మోదీ

‘క్రాంతి కుమార్‌ బాగున్నారా?’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించారు. ‘ఉజ్వల భారత్‌-ఉజ్వల భవిష్యత్తు-పవర్‌ 2047’ పేరుతో

Updated : 31 Jul 2022 08:55 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ‘క్రాంతి కుమార్‌ బాగున్నారా?’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించారు. ‘ఉజ్వల భారత్‌-ఉజ్వల భవిష్యత్తు-పవర్‌ 2047’ పేరుతో నిర్వహించిన విద్యుత్తు మహోత్సవం శనివారం ఉదయం విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దృశ్యశ్రవణ విధానంలో చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన క్రాంతి కుమార్‌తో మాట్లాడారు. ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగిని ఈ సంభాషణను అనువదించారు. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది.

ప్రధానమంత్రి: క్రాంతి కుమార్‌ బాగున్నారా..? చెప్పండి..
క్రాంతి కుమార్‌: నా పేరు క్రాంతి కుమార్‌, మాది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మారుమూల గ్రామమైన రత్నగిరి కాలనీ.

ప్రధానమంత్రి: క్రాంతి విద్యుత్తు రాకముందు.. వచ్చిన తర్వాత ఏం తేడా గమనించారు. అప్పుడెలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది?
క్రాంతి కుమార్‌: మా ఊరిలో విద్యుత్తు సౌకర్యం లేనప్పుడు, రాత్రి పనులు చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. 2017 డిసెంబరులో మా ఊరిలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద విద్యుత్తు వచ్చింది. టీవీలు సమకూర్చుకున్నాం. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి వీలుకుదిరింది. ఇంటి వద్దే మంచినీటి సౌకర్యం పొందుతున్నాం. విద్యుత్తు చాలా ఉపయోగపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు