జేఈఈ మెయిన్‌ ఫలితాలెప్పుడు?

జేఈఈ మెయిన్‌ ర్యాంకులను శనివారం రాత్రి ప్రకటిస్తారా?...ఆదివారం ఉదయం ప్రకటిస్తారా?అని దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు  ఎదురుచూస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది  ఆగస్టు

Updated : 06 Aug 2022 05:14 IST

నేటి రాత్రా? రేపు ఉదయమా?

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ర్యాంకులను శనివారం రాత్రి ప్రకటిస్తారా?...ఆదివారం ఉదయం ప్రకటిస్తారా?అని దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు  ఎదురుచూస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది  ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏప్రిల్‌ 14న ఐఐటీ బాంబే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్ని ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెల్లడించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షలు జులై 30న ముగిశాయి. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తెలిపే గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మెయిన్‌-1, 2లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల్ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడిస్తుంది. కానీ ఫలితాలు ఎప్పుడన్నది ఆ సంస్థ అధికారికంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఈనెల 28న జరగనుంది. ఫలితాలను సెప్టెంబరు 11న  విడుదల చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని