Andhra news: స్వచ్ఛ లక్ష్యానికి తూట్లు.. చెత్తతో పాట్లు..!

గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో 2018లో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో చెత్త నిర్వహణ కేంద్రాన్ని నిర్మించారు. తడి, పొడి చెత్తను

Updated : 06 Aug 2022 04:31 IST

గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో 2018లో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో చెత్త నిర్వహణ కేంద్రాన్ని నిర్మించారు. తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్‌ చేసి వాటి ద్వారా ఎరువులను తయారుచేసేందుకు వీటిని ఏర్పాటుచేశారు. ఎరువులను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను విక్రయించడం ద్వారా సంపద సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేశారు. అందుకు అవసరమైన యంత్రాలు సైతం కొనుగోలుచేశారు. కానీ అధికారులు వాటికి విద్యుత్‌ కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఈ కేంద్రం నిరుపయోగంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ కేంద్రం పక్కనే ఖాళీ ప్రాంతంలో నిత్యం చెత్తను గుట్టలుగా వేస్తున్నారు. దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోగాలబారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నిర్వహణ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలోని చాలా కేంద్రాల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ విషయమై జడ్పీ సీఈవో లక్ష్మీపతి మాట్లాడుతూ ఒక్కొక్కటిగా అన్ని కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని