అగ్రి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి అగ్రి డిగ్రీ కోర్సులు ఫుడ్‌ టెక్నాలజీ, బైపీసీ, ఎంపీసీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (ఎంపీసీ రైతు

Updated : 06 Aug 2022 05:42 IST

గుంటూరు, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి అగ్రి డిగ్రీ కోర్సులు ఫుడ్‌ టెక్నాలజీ, బైపీసీ, ఎంపీసీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (ఎంపీసీ రైతు కోటా), కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. angrau.ac.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ నెల 16 లోపు పూర్తిచేసి పంపాలన్నారు. బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు ఇంటర్‌ మార్కులతో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద దరఖాస్తు చేయడానికి ఈ నెల 25 లోపు వాటిని పంపాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని