గనులశాఖ కొత్త విధానాలపై సమీక్షకు 4 ఉప కమిటీలు

గనులశాఖలో ఈ-వేలం ద్వారా లీజు కేటాయింపు, అదనంగా ప్రీమియం నగదు, వార్షిక డెడ్‌రెంట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ పెంపు వంటి కొత్తగా తీసుకొచ్చిన విధానాలను సమీక్షించేందుకు

Published : 06 Aug 2022 05:27 IST

ఈనాడు-అమరావతి: గనులశాఖలో ఈ-వేలం ద్వారా లీజు కేటాయింపు, అదనంగా ప్రీమియం నగదు, వార్షిక డెడ్‌రెంట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ పెంపు వంటి కొత్తగా తీసుకొచ్చిన విధానాలను సమీక్షించేందుకు నాలుగు ఉపకమిటీలను నియమించాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై గనులశాఖకు చెందిన నలుగురు అధికారులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ మినరల్‌ ఇండస్ట్రీ (ఫెమీ), ఏపీ రోడ్‌మెటల్‌ ఆర్గనైజేషన్స్‌ (ఆప్సీ), గ్రానైట్‌ ఫ్యాక్టరీస్‌, క్రషర్స్‌ తదితర సంఘాలకు చెందిన 25 మందితో గత నెలలో కమిటీని వేశారు. ఈ కమిటీ తొలి సమావేశం శుక్రవారం  ఆ శాఖ సంచాలకుడి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్త విధానాల వల్ల లీజుదారులకు కలిగే ఇబ్బందులను కమిటీ సభ్యులు చర్చించారు. దీంతో మరింత సమగ్రంగా సమీక్షించేందుకు వీలుగా నాలుగు ఉప కమిటీల నియామకానికి గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌కు కలిపి ఓ ఉప కమిటీ, 31 చిన్నతరహా ఖనిజాలకు, గ్రానైట్‌ క్వారీలకు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు వేర్వేరుగా ఒక్కో ఉప కమిటీలను త్వరలో నియమించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ ఈ నెలాఖరుకు నివేదిక అందజేయనున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫెమీ అధ్యక్షుడు పద్మనాభరావు, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌.రావు, ఆప్సీ అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని