పుణె ల్యాబ్‌కు మంకీపాక్స్‌ అనుమానితుడి నమూనాలు

విశాఖలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాల ఆసుపత్రిలో మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వైద్య విద్యార్థి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని జాతీయ

Published : 07 Aug 2022 02:09 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాల ఆసుపత్రిలో మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వైద్య విద్యార్థి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆంధ్ర వైద్య కళాశాల వైద్యుల బృందం శనివారం అనుమానితుని నుంచి నమూనాలను సేకరించి తదుపరి పరీక్షలకు పంపినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. బాధితుని శరీరంపై ఉన్న మచ్చలు నల్లబారాయని, మంకీపాక్స్‌ కాకపోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. అయినా ముందుజాగ్రత్తగా నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ కేంద్రానికి పంపినట్లు వివరించారు. బాధితుడిని ఐసొలేషన్‌లో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని