మెనూ ఎలా అమలు చేస్తే బాగుంటుంది?

సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘మేనమామ మెనూలోనూ కోతలే’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై

Published : 07 Aug 2022 02:09 IST

సంక్షేమ శాఖల అధికారుల నుంచి సీఎంవో ఆరా

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘మేనమామ మెనూలోనూ కోతలే’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎంవోలోని అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం అమలవుతున్న డైట్‌ ఛార్జీలు...మెనూ ఎలా అమలు చేస్తే బాగుంటుంది? అనే విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ఆదేశించారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ అధికారులు జిల్లా అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు  జిల్లాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో? ప్రతిపాదనలు పంపాలని అధికారులకు నిర్దేశించినట్లు తెలిసింది. దీనిపై 2,3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని