వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. సోమవారానికి ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో

Published : 07 Aug 2022 02:09 IST

మరింత బలపడే అవకాశం

ఈనాడు, అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. సోమవారానికి ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల మధ్య రాష్ట్రంలోనే అత్యధికంగా.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 124 మి.మీ, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో 106.5 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా సుబ్బులులో 93 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్‌, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని