ఎంపీ మాధవ్‌ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం లేఖ

Published : 07 Aug 2022 02:09 IST

డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాల నిగ్గు తేల్చాలన్నారు. 15 రోజుల్లో విచారణ నివేదికను కమిషన్‌కు అందించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

రెండు రోజుల తర్వాత స్పందించడంపై విమర్శలు
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో మహిళా కమిషన్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియోపై ప్రతిపక్షాలు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నా రెండు రోజులుగా కనీసం ఎక్కడా స్పందించలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయి దేశవ్యాప్తంగా ఎంపీ వ్యవహారశైలిపై చర్చ జరిగినా కమిషన్‌ మాత్రం పట్టించుకోలేదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత తీరిగ్గా కమిషన్‌ స్పందించింది. విచారణ జరపాలని డీజీపీకి లేఖ రాయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని