కన్నీటి నది దాటాల్సిందే!

అయినవారిని కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యే కుటుంబీకులు.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో శ్మశాన వాటికకు

Published : 07 Aug 2022 03:23 IST

అయినవారిని కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యే కుటుంబీకులు.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో శ్మశాన వాటికకు చేరుకోవాలంటే తుంగభద్ర నదిలోంచి వెళ్లాల్సి వస్తోంది. గతంలో శ్మశానానికి ఉన్న దారిని కొందరు కబ్జా చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఉద్ధృతంగా ప్రవహించే తుంగభద్రలోంచి పాడె మోసుకుంటూ వెళ్తున్నారు. అధికారులు స్పందించి శ్మశాన వాటికకు రహదారి చూపాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.         

- న్యూస్‌టుడే, నందవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని