శ్రీవారి ఆలయ భూమి పూజకు మహారాష్ట్ర సీఎంకు ఆహ్వానం

ముంబయిలో తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజా కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను తితిదే ఛైర్మన్‌ వైవీ

Published : 07 Aug 2022 03:23 IST

తిరుమల, న్యూస్‌టుడే: ముంబయిలో తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజా కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆహ్వానించారు. శనివారం ఉదయం ముంబయిలో వారిని కలిసి, సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ నెల 21న భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం తితిదేకు పదెకరాల భూమి అప్పగించింది. రేమండ్స్‌ కంపెనీ అధినేత గౌతం సింఘానియా స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని