Nagarjuna sagar: సాగర్‌కు రోజూ పది టీఎంసీల నీరు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ రోజుకు పది టీఎంసీలకు పైగానే పెరుగుతోంది. ఈ క్రమంలో శనివారం నాటికి

Updated : 07 Aug 2022 06:06 IST

గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద

ఈనాడు, హైదరాబాద్‌; నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టు (మన్ననూర్‌),  న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ రోజుకు పది టీఎంసీలకు పైగానే పెరుగుతోంది. ఈ క్రమంలో శనివారం నాటికి జలాశయం నీటిమట్టం 570.20 (గరిష్ఠం 590.00) అడుగులకు చేరింది. 257.0774 (గరిష్ఠ స్థాయి 312.0540) టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క ఆలమట్టికి క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల వద్ద నిలకడగా ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర నుంచి 65 వేల క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి 1.43 లక్షల క్యూసెక్కులు కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరీవాహకంలో వరద మళ్లీ పెరుగుతోంది. శ్రీరామసాగర్‌కు 78 వేల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 88 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి రెండు లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. రాష్ట్రంలోని మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.

* శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 5 యూనిట్లలో ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి నుంచి 5 అర్ధరాత్రి వరకు 10.804 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానించామని జెన్‌కో అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టులో నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుందని, నీటి నిలువ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా ఉందని డ్యామ్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని