సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు

సికింద్రాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ మూడు రోజుల పాటు రద్దయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల

Updated : 08 Aug 2022 06:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ మూడు రోజుల పాటు రద్దయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ (12771) ఎక్స్‌ప్రెస్‌ 8, 10, 12వ తేదీల్లో, రాయ్‌పుర్‌-సికింద్రాబాద్‌ (12772) ఎక్స్‌ప్రెస్‌ 9, 11, 14వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.

త్రివేండ్రం-సికింద్రాబాద్‌ (17229) ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళల్ని రైల్వేశాఖ మార్చింది. త్రివేండ్రం నుంచి ఉదయం 6.45 గంటలకు బదులుగా 10.15 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. ఈ నిర్ణయం ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 7 వరకు (ఆదివారాలు మినహా) అమల్లో ఉంటుందని ద.మ.రైల్వే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని