ప్రేమించే పాలకులను మరచిపోరాదు

మనల్ని ప్రేమించి, ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పాలకుల్ని మరచిపోరాదని, రాష్ట్రంలోని బలహీనవర్గాల్లో గౌడలు పెద్దన్న పాత్ర పోషిస్తారని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ మహారాజ్‌

Updated : 08 Aug 2022 06:03 IST

సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వారోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: మనల్ని ప్రేమించి, ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పాలకుల్ని మరచిపోరాదని, రాష్ట్రంలోని బలహీనవర్గాల్లో గౌడలు పెద్దన్న పాత్ర పోషిస్తారని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ మహారాజ్‌ జయంతి జాతీయ వారోత్సవాలను ఏపీ మంత్రి జోగి రమేశ్‌తో కలిసి ఆదివారం ఆయన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గౌడ్‌ల వృత్తికి వన్నెలద్దారన్నారు. ఏపీ ప్రభుత్వం సైతం గౌడ్‌ల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో రూ.20 కోట్లతో నీరా కేఫ్‌లు ప్రారంభిస్తున్నామన్నారు. గౌడ్‌లపై ప్రభుత్వాలు అనవసరమైన కేసులు పెట్టొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. ఇటీవల చట్టసభల్లో గౌడ్‌ల సంఖ్య తగ్గిపోయిందని, రానున్న రోజుల్లో ఎక్కువ మందిని చట్టసభలకు పంపించాలని కోరారు. సదస్సుకు జైగౌడ్‌ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డా.వట్టికూటి రామారావుగౌడ్‌ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణగౌడ్‌, జైగౌడ్‌ ఉద్యమం తెలంగాణ, ఏపీ అధ్యక్షులు నరేష్‌గౌడ్‌, కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని