Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!

విశాఖ మన్యం లంబసింగిలో ఆదివారం మంచు దోబూచులాడింది. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో మంచు తెరలు ఇక్కడి గిరులను చుట్టేస్తాయి. కానీ, ప్రస్తుతం వరుస వర్షాల నేపథ్యంలో మన్యంలో

Published : 08 Aug 2022 09:15 IST

విశాఖ మన్యం లంబసింగిలో ఆదివారం మంచు దోబూచులాడింది. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో మంచు తెరలు ఇక్కడి గిరులను చుట్టేస్తాయి. కానీ, ప్రస్తుతం వరుస వర్షాల నేపథ్యంలో మన్యంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఆదివారం వర్షం వచ్చి వెలిశాక.. అకస్మాత్తుగా మంచు మేఘాలు పచ్చని కొండల్ని హిమగిరులుగా మార్చేశాయి. ముందే పలకరిస్తున్న మంచు సోయగాలు మన్యానికి వచ్చే పర్యటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

- న్యూస్‌టుడే, చింతపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని