చిన్న ఆసుపత్రులపై రుసుముల భారం తగ్గించాలి

చిన్న ఆసుపత్రులను కాపాడుకుంటే.. పేద, మధ్య తరగతి వారందరికీ తక్కువ ధరకు వైద్యం అందుతుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు

Published : 08 Aug 2022 05:12 IST

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: చిన్న ఆసుపత్రులను కాపాడుకుంటే.. పేద, మధ్య తరగతి వారందరికీ తక్కువ ధరకు వైద్యం అందుతుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు అన్నారు. సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం నెల్లూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ పడకలున్న ఆసుపత్రికి ఛార్జీలు, పన్నుల భారం పెరిగిపోయిందని తెలిపారు. ఈ భారం రోగులపై వేయక తప్పడంలేదని, ఈ క్రమంలో చిన్న ఆసుపత్రులు మూత పడుతున్నాయని పేర్కొన్నారు. 20 పడకల ఆసుపత్రులకు ప్రభుత్వం పలు ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆసుపత్రిపై దాడి చేసిన వారికి మూడేళ్లు శిక్షపడేలా ప్రస్తుతం చట్టం ఉందని, దీన్ని ఏడేళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ జి.నందకిషోర్‌, కోశాధికారి డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ అశోక్‌, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts