పేదల వివాహాలను అడ్డుకున్న జగన్‌

రాష్ట్రంలో పేదవాళ్ల వివాహాలను సీఎం జగన్‌రెడ్డి అడ్డుకున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ ధ్వజమెత్తారు. పేదలపై జగన్‌ది కపటప్రేమ అని మరోసారి రుజువైందని

Updated : 08 Aug 2022 06:50 IST

తెదేపా రాష్ట్ర కార్యదర్శి రమణ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో పేదవాళ్ల వివాహాలను సీఎం జగన్‌రెడ్డి అడ్డుకున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ ధ్వజమెత్తారు. పేదలపై జగన్‌ది కపటప్రేమ అని మరోసారి రుజువైందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘కల్యాణమస్తు అమలుకు నెల క్రితమే తితిదే లేఖ పంపితే జగన్‌ ఇప్పటికీ అనుమతివ్వలేదు. సామూహిక వివాహాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వేల జంటల ఆశలు ఆవిరయ్యాయి. తితిదే ఉన్నది వీఐపీల కోసమే అన్నట్లుగా జగన్‌ మార్చారు’ అని రమణ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని