అచ్చెరువొందెలా.. చీరలపై చిత్తరువులు

తాజ్‌మహల్‌ నుంచి ఉపగ్రహాల వరకు.. నేతల ముఖచిత్రాల నుంచి దేవుళ్ల ఆకృతుల వరకు పట్టుపోగుల్లో చేరి, చీరలపై చిత్తరువులుగా రూపుదిద్దుకున్నాయి. మదిలో మెదిలిన

Published : 08 Aug 2022 05:12 IST

ధర్మవరానికి చెందిన నాగరాజు కళానైపుణ్యం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తాజ్‌మహల్‌ నుంచి ఉపగ్రహాల వరకు.. నేతల ముఖచిత్రాల నుంచి దేవుళ్ల ఆకృతుల వరకు పట్టుపోగుల్లో చేరి, చీరలపై చిత్తరువులుగా రూపుదిద్దుకున్నాయి. మదిలో మెదిలిన ఆకారాలు వస్త్రంపై అల్లుకొని అందాలు ద్విగుణీకృతమయ్యాయి. ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు నైపుణ్యం చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కృతమైంది. కుటుంబ వృత్తికి ఆధునికత, సృజనాత్మకతను జోడించి నూతన ఒరవడి సృష్టిస్తున్నారు నాగరాజు. కంప్యూటర్‌ జాకార్డ్‌ పరికరంతో కొత్త డిజైన్లకు ప్రాణం పోస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక ధోరణులపై ప్రభుత్వ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని