Andhra news: కాలు మొక్కుతా.. ఇల్లు ఇప్పించండి..

మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా అని  తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి

Updated : 09 Aug 2022 06:45 IST

న్యూస్‌టుడే, వరదయ్యపాళెం: మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా అని  తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు విన్నవించింది. తూర్పు హరిజనవాడకు చెందిన బజ్జమ్మ అనే మరో మహిళ కూడా తన ఆవేదనను వెలిబుచ్చింది. ‘నా భర్త గతంలో చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకే కుమారుడు మృతిచెందాడు. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ బీమా మంజూరు కాలేదు. రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేకపోయింది’ అని బజ్జమ్మ వాపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని