జాంధానీ చీరకు జాతీయ పురస్కారం

ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌

Updated : 09 Aug 2022 05:56 IST

కొత్తపల్లి, న్యూస్‌టుడే: ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌ సంస్థకు జాతీయ పురస్కారం లభించింది. సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఆదివారం పురస్కారం అందుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా పురస్కార ప్రదానం జరగలేదు. పట్టు చీరలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడానికి తన తండ్రి స్వర్గీయ లొల్ల వెంకటరావు కృషి చేశారని, ఈ పురస్కారంతో ఆయన కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని