Nirmala Sitharaman: ‘ఏపీలో జీపీఎఫ్‌ సొమ్ము రూ.413 కోట్లు డెబిట్‌ అయింది’

ఏపీ ట్రెజరీల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 68,020 మంది ఖాతాదారుల నుంచి రూ.413 కోట్ల జీపీఎఫ్‌ సొమ్ము డెబిట్‌ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన

Updated : 09 Aug 2022 10:53 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌

ఈనాడు, దిల్లీ: ఏపీ ట్రెజరీల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 68,020 మంది ఖాతాదారుల నుంచి రూ.413 కోట్ల జీపీఎఫ్‌ సొమ్ము డెబిట్‌ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘ఉద్యోగులకు ఎలాంటి సమాచారం అందించకుండా, వారి అనుమతి తీసుకోకుండానే 2021, 2022ల్లో వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్మును ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏజీ కార్యాలయం అనుమతి ఇచ్చిన విషయం కేంద్ర దృష్టికి వచ్చిందా’ అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘ఏపీ జీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలను అకౌంటెంట్‌ జనరల్‌ నిర్వహిస్తున్నారు. విత్‌డ్రాయల్స్‌, డిపాజిట్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల నుంచి వచ్చే నెలవారీ ఖాతాలకు సంబంధించిన దస్తావేజుల ప్రకారమే జరుగుతాయి. జీపీఎఫ్‌ ఖాతాల్లోకి డిపాజిట్లు (క్రెడిట్స్‌), విత్‌డ్రాయల్స్‌ (డెబిట్స్‌)కు సంబంధించిన ఎంట్రీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల నుంచి వచ్చిన దస్తావేజుల ఆధారంగానే చేశాం. దాని ప్రకారం ఏజీ కార్యాలయం 68,020 మంది జీపీఎఫ్‌ చందాదారులకు సంబంధించిన రూ.413.73 కోట్లను డెబిట్‌ చేసింది’ అని కేంద్రమంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని