TTD: రద్దీ దృష్ట్యా తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి

ప్రత్యేక పర్వదినాలు, సెలవుల కారణంగా ఈనెల 11 నుంచి పది రోజుల పాటు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. దర్శనం,

Updated : 10 Aug 2022 03:50 IST

భక్తులకు తితిదే విజ్ఞప్తి

తిరుమల, న్యూస్‌టుడే: ప్రత్యేక పర్వదినాలు, సెలవుల కారణంగా ఈనెల 11 నుంచి పది రోజుల పాటు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. దర్శనం, వసతి గదులను ముందుగానే బుక్‌ చేసుకుని భక్తులు తిరుమలకు రావాలని సూచించింది. తమిళులు పవిత్రంగా భావించే పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17తో ముగుస్తుంది. ఆ సమయంలోనూ యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరగవచ్చని, వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, దివ్యాంగులు ఆ తర్వాతే తిరుమలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులు వారికి నిర్దేశించిన సమయం వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్‌లలో గంటల తరబడి వేచి ఉండడానికి సంసిద్ధతతో రావాలని కోరింది.

* రేపు డయల్‌ తితిదే ఈవో: తితిదేకు సంబంధించి సమస్యల ప్రస్తావన, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తితిదే ‘డయల్‌ ఈవో’ కార్యక్రమం నిర్వహించనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనం నుంచి ఈవో ఏవీ ధర్మారెడ్డి నేరుగా భక్తుల కాల్స్‌కు స్పందిస్తారు. ఫోన్‌ నంబర్‌ 0877-2263261.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని