Updated : 10 Aug 2022 03:44 IST

Andhra news: సకాలంలో సాగునీరు అందించాలి

మాజీ మంత్రి పరిటాల సునీత

రామగిరి, న్యూస్‌టుడే: జలాశయాలు నిండిన క్రమంలో సకాలంలో సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి, వెంకటాపురం గ్రామాల్లోని తన సొంత పొలంలో మంగళవారం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో కలసి వరినాట్లు వేశారు. టమాటా తోటలో కాయలు తొలగించి, మలి కాపునకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో పెద్ద ఎత్తున టమాటా సాగు చేశారని, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు వాటిని రోడ్లపై పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఏ పంటలు సాగుచేస్తే లాభదాయకమో వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని సూచించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని