అసలే వర్షాకాలం.. పైపెచ్చు ప్రమాదకరం!

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు బాగా దెబ్బతింది. వర్షాలకు తరగతి గది పైకప్పులో నీటి చెమ్మ దిగి.. పెచ్చులూడి పడుతున్నాయి.  

Published : 10 Aug 2022 06:10 IST

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు బాగా దెబ్బతింది. వర్షాలకు తరగతి గది పైకప్పులో నీటి చెమ్మ దిగి.. పెచ్చులూడి పడుతున్నాయి. విధిలేక విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఆ భవనంలోనే ఉంటున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో విశాఖ మద్దిలపాలెంలోని ఓ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారు. అలాంటి ప్రమాదం ఇక్కడ జరగక ముందే గదులకు మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

-ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని