ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార గడువు మరోసారి పెంపు

అనుమతులు తీసుకోని లేఅవుట్లలో ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణ కోసం లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)లో వచ్చిన పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కార గడువుని అక్టోబరు 31

Published : 11 Aug 2022 03:32 IST

ఈనాడు, అమరావతి: అనుమతులు తీసుకోని లేఅవుట్లలో ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణ కోసం లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)లో వచ్చిన పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కార గడువుని అక్టోబరు 31 వరకు ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎల్‌ఆర్‌ఎస్‌-2020 ప్రకటించాక ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు చాలావరకు ఇంకా పెండింగ్‌ ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తోంది. ఇది వరకు ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. మరోసారి గడువు పెంచాలన్న పట్టణ ప్రణాళిక విభాగం ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని