ఆందోళన బాటలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరికీ 11వ పీఆర్సీని అనుసరించి మినమమ్‌ టైంస్కేలును

Published : 11 Aug 2022 03:32 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరికీ 11వ పీఆర్సీని అనుసరించి మినమమ్‌ టైంస్కేలును గత జనవరి నుంచి ఇవ్వాలని గత ఏడు నెలల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం కనిపించడం లేదని ఏపీ జాతీయ ఆరోగ్య మిషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు గురువారం సీఎం చిత్రపటానికి రాఖీ కట్టి నిరసన తెలియచేస్తామని తెలిపింది.. ఈ నెల 14న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షురాలు డి.దయామణి, కన్వీనర్‌ సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. 22న సామూహికంగా సెలవుపెట్టి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts