‘విద్యా దీవెన’ సాయం జమ నేడు

జగనన్న విద్యా దీవెన పథకం కింద 11.02లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బోధన రుసుములను గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో

Updated : 11 Aug 2022 05:14 IST

ఈనాడు, అమరావతి; బాపట్ల, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెన పథకం కింద 11.02లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బోధన రుసుములను గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి బాపట్లలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఆయా ఖాతాల్లోకి రూ.694కోట్లు జమ చేస్తారని వెల్లడించింది. పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా త్రైమాసికం ముగిసిన వెంటనే డబ్బు వేస్తున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1,778కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.11,715 కోట్ల సాయం అందించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బాపట్లలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో సభావేదిక, ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేశారు. బాపట్ల జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలకటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని