రుషికొండపై పనుల పరిశీలనకు అనుమతించండి

విశాఖలోని రుషికొండపై పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించేందుకు వెళుతున్న తనను పోలీసులు, అధికారులు అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ జాతీయ

Updated : 11 Aug 2022 05:08 IST

హైకోర్టులో సీపీఐ నేత నారాయణ వ్యాజ్యం

ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?

ధర్మాసనం విచారణ చేస్తోందిగా అంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి

ఈనాడు, అమరావతి: విశాఖలోని రుషికొండపై పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించేందుకు వెళుతున్న తనను పోలీసులు, అధికారులు అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పర్యాటకశాఖ, హోంశాఖ, విశాఖ పోలీసు కమిషనర్‌, ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌ సీఎండీకి నోటీసులు జారీచేసింది. రుషికొండపై నిర్మాణాలు అనుమతులకు లోబడి జరుగుతున్నాయా? లేదా అనే వ్యవహారంపై ధర్మాసనం విచారణ జరుపుతుందని తెలిపింది. ఈ దశలో పిటిషనర్‌ ఆ ప్రాంతంలో పర్యటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నిర్మాణ ప్రదేశం గుత్తేదారు ఆధీనంలో ఉన్నందున.. ఆ ప్రాంతాన్ని పరిశీలించాలనుకుంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. రుషికొండపై పనుల పరిశీలనకు వెళుతున్న తమను అధికారులు అడ్డుకోవడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని