విద్యా దీవెన నిధుల్లో స్వల్పంగా తగ్గుదల

గత రెండు విడతల జగనన్న విద్యా దీవెన పథకం (బోధనారుసుములు) నిధుల విడుదలతో పోలిస్తే గురువారం విడుదల చేయనున్న నిధుల్లో కాస్త తగ్గుదల కనిపించింది.

Published : 11 Aug 2022 03:30 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత రెండు విడతల జగనన్న విద్యా దీవెన పథకం (బోధనారుసుములు) నిధుల విడుదలతో పోలిస్తే గురువారం విడుదల చేయనున్న నిధుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య 17 వేలు పెరిగినా...బోధనా రుసుముల నిధులు రూ.15 కోట్లు తగ్గాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు విడుదల చేసింది. ఏప్రిల్‌-జూన్‌కు గురువారం విడుదల చేయనున్న విద్యాదీవెన పథకానికి సంబంధించి ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ప్రకటన వివరాలను చూస్తే...దాదాపు 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు ముఖ్యమంత్రి జగన్‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని