తరగతుల విలీనంపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన

పాఠశాలల విలీనంపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లా సంయుక్త కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తిస్థాయిలో

Published : 11 Aug 2022 03:30 IST

ఈనాడు, అమరావతి: పాఠశాలల విలీనంపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లా సంయుక్త కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేదనే ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5, ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7,8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంలో స్థానికంగా ఉన్న ఇబ్బందులపై 70మంది ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. 820 పాఠశాలలపై అభ్యంతరాలు తెలిపారు. వీటిల్లో సుమారు 420 అభ్యంతరాల్లో కాలనీలు, గ్రామాల నుంచి పాఠశాలలను తరలించొద్దని పేర్కొన్నారు. మరో 400 చోట్ల విలీనం కారణంగా విద్యార్థులు జాతీయ, ప్రధాన రహదారులు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వస్తోందని, కిలోమీటరు కంటే దూరం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఎమ్మెల్యేల అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు సంయుక్త కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ సంయుక్త కలెక్టర్‌ క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే మండల విద్యాధికారుల ద్వారా నివేదికను పంపినట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మరోసారి అన్ని జిల్లాల్లోనూ పకడ్బందీగా పరిశీలనలు చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను ఒకటి, రెండు రోజుల్లో జారీ చేయనుంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts