నేడు ఆరోగ్య మిత్రల విధుల బహిష్కరణ

తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం విధులను బహిష్కరిస్తామని రాష్ట్ర ఆరోగ్య మిత్ర సంఘం వెల్లడించింది. ఆరోగ్య సిబ్బందిని కేడర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం

Published : 11 Aug 2022 03:30 IST

అధికారులతో చర్చలు విఫలం

ఈనాడు, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం విధులను బహిష్కరిస్తామని రాష్ట్ర ఆరోగ్య మిత్ర సంఘం వెల్లడించింది. ఆరోగ్య సిబ్బందిని కేడర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం ప్రకటించాలని, పీహెచ్‌సీల్లో ఉండే మిత్రలను కొనసాగించాలని, ట్రావెలింగ్‌ ఎలవెన్సు తదితర సమస్యలపై సంఘం నేతలు  ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రధాన కార్యాలయంలో అదనపు సీఈఓ మధుసూదనరెడ్డి, ఇతర అధికారులతో బుధవారం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎటువంటి హామీ లభించనందున తొలుత ప్రకటించిన విధంగానే గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలియచేస్తామని సంఘం తెలిపింది. అత్యవసర కేసుల విషయంలో యథావిధిగా తమ సేవలు అందుతాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని