వీఎంఆర్‌డీఏ అవసరాలకే భూములు కోరాం

ప్రైవేటు భూముల సేకరణకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వద్ద తగిన ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ భూముల కోసం తమ పరిధిలోని కలెక్టర్‌కు

Published : 11 Aug 2022 03:30 IST

ఎస్టేట్‌ అధికారి వెల్లడి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రైవేటు భూముల సేకరణకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వద్ద తగిన ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ భూముల కోసం తమ పరిధిలోని కలెక్టర్‌కు విన్నవిస్తుందని సంస్థ ఎస్టేట్‌ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే భీమిలి మండలం కొత్తవలసలో ఉన్న 50 ఎకరాలను కేటాయించాలని కోరామని వివరించారు. ఎవరికో ప్రయోజనం కల్పించేందుకు ఈ భూములు కేటాయించాలని కోరలేదని వెల్లడించారు. ఓ పీఠానికి పరోక్షంగా ప్రయోజనం కలిగించేందుకు దస్త్రాలు కదులుతున్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎస్టేట్‌ అధికారి స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని