ఉన్నత విద్యా సంస్థల్లో ముఖ ఆధారిత హాజరు

ఉన్నత విద్య సంస్థలో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ హాజరు

Updated : 11 Aug 2022 05:36 IST

బోధన రుసుములతో అనుసంధానం

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్య సంస్థలో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ హాజరు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అప్పగించనున్నారు. నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి కొంత మొత్తం వసూలు చేయనున్నారు. విద్యార్థుల హాజరుతో బోధన రుసుముల చెల్లింపును అనుసంధానం చేస్తారు. కనీసం 75శాతం హాజరు ఉంటేనే బోధన రుసుములను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు కళాశాలలే వేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే అధ్యాపకులు తమ సెల్‌ఫోన్లలో హాజరు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తరగతిలోని విద్యార్థులను ఫోన్‌లో ఫొటో తీసి, అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కృత్రిమ మేధ ద్వారా విద్యార్థుల హాజరును గుర్తిస్తారు. మొదట విద్యార్థుల ఫొటోలను తీసి, సర్వర్‌లో ఉంచుతారు. ఆ తర్వాత అధ్యాపకులు తీసి పంపే ఫొటోలను సర్వర్‌లోని ఫొటోలతో సరిపోల్చి చూస్తారు. దీని ప్రకారం హాజరు నమోదవుతుంది. రాష్ట్రంలో డిగ్రీ మూడేళ్లు కలిపి 4.50లక్షలు, ఇంజినీరింగ్‌లో 4లక్షలు, పీజీలో 2లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ముఖ ఆధారిత విధానంలోనే హాజరు వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని