అనురాగాలను ఇచ్చిపుచ్చుకునే రాఖీ పండగ

‘రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ‘సోదరీ సోదరుల మధ్య

Updated : 11 Aug 2022 05:39 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌

ఈనాడు, అమరావతి: ‘రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ‘సోదరీ సోదరుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలను ఇచ్చిపుచ్చుకునే పండగ ఇది. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పూర్ణిమగా వ్యవహరించే రక్షాబంధన్‌ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని రాజ్‌భవన్‌ నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆత్మీయ అనురాగాల వేడుక : సీఎం జగన్‌
‘ఆత్మీయతలు, అనురాగాలు పంచే పండగ రాఖీ’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ శుభాకాంక్షలు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, రక్షణ పరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి, అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని