ఈ-క్రాప్‌ నమోదులో ఎన్‌ఐసీ సహకారం

రాష్ట్రంలో ఈ-క్రాప్‌ నమోదులో ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మటిక్స్‌ సెంటర్‌) సహకారం తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. పంటల

Updated : 11 Aug 2022 05:40 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ-క్రాప్‌ నమోదులో ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మటిక్స్‌ సెంటర్‌) సహకారం తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. పంటల బీమాకు రైతులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, వేరుసెనగతో సహా అన్ని పంటలకు వర్తిస్తుందని వివరించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులతో బుధవారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫసల్‌ బీమాతో అనుసంధానమైనా రైతులకు ఎలాంటి నష్టం కలగదని పేర్కొన్నారు. ఎక్కడ ఏ పంట సాగైనా.. అది ఈ-క్రాప్‌లో నమోదు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సూచించారు. సెప్టెంబరు 7 నాటికి నమోదు పూర్తి చేసి 10నాటికి రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీకి ఉంచాలని చెప్పారు. పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా ఈ-కేవైసీని ఆగస్టు 30 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని