ఆహారశుద్ధి రంగంపై అవగాహనకు ఫ్యాప్సీ ఆన్‌లైన్‌ శిక్షణ

పారిశ్రామికవేత్తలకు ఆహార శుద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుపై అవగాహన కల్పించడానికి ఈ నెల 17 నుంచి పది రోజుల పాటు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ

Updated : 11 Aug 2022 05:40 IST

ఈనాడు, అమరావతి: పారిశ్రామికవేత్తలకు ఆహార శుద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుపై అవగాహన కల్పించడానికి ఈ నెల 17 నుంచి పది రోజుల పాటు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో ఉన్న వారికి శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొంది. శిక్షణలో భాగంగా  ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, లీగల్‌ ఇంప్లిమెంట్స్‌ నిపుణులు సూచనలు అందిస్తారని పేర్కొంది. మార్కెట్‌ను గుర్తించే పద్ధతులు, ముడిపదార్థాల సేకరణ, బ్యాంకు నుంచి రుణాలు, చట్టపరమైన అంశాల్లో సూచనలు ఉంటాయని, వివరాల కోసం ఫోన్‌ నంబర్‌ 80085 79624లో సంప్రదించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని