Updated : 11 Aug 2022 05:40 IST

పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి

నియమావళి ఖరారు చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి జిల్లా విశ్రాంత న్యాయమూర్తి ఛైర్మన్‌గా ఉంటారని తెలిపింది. రాష్ట్ర, జిల్లా అథారిటీలు రెండింటిలోనూ ముగ్గురు లేదా అయిదుగురు సభ్యులు ఉంటారని వివరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి ఫిర్యాదుల అథారిటీ నియమావళిని ఖరారు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించే వారిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు ఛైర్మన్‌గా నియమించొచ్చని నియమావళిలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి అథారిటీ సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించే ప్యానల్‌ జాబితాలో నుంచి కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. జిల్లా స్థాయి అథారిటీ సభ్యులుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ లేదా లోకాయుక్తా లేదా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సూచించే ప్యానల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అదనపు ఎస్పీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల్ని రాష్ట్ర స్థాయి అథారిటీ విచారిస్తుంది. వీరు కాకుండా మిగతా పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల్ని జిల్లా స్థాయి కమిటీ విచారిస్తుంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని