పదవీవిరమణ ప్రయోజనాలకు ఆందోళన చేస్తాం

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించకపోతే సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన

Updated : 11 Aug 2022 05:41 IST

ఎస్టీయూ హెచ్చరిక

ఈనాడు, అమరావతి: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించకపోతే సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌. తిమ్మన్న ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా 13లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. పదవీవిరమణ చేసి వారికి సకాలంలో ఆర్థిక ప్రయోజనాలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఖజానా కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు బుధవారం నిరసనలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, భీమవరంలో ఎస్టీయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కర్నూలులో ప్రధాన కార్యదర్శి తిమన్న పాల్గొన్నారు. అయా నిరసనల్లో వారు మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను చెల్లించడం లేదు. దీంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. వైద్య బిల్లుల చెల్లింపులు ఏడాది కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. డీఏ బకాయిలు చెల్లించడం లేదు. పురపాలక ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలి. పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలి. ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు