ప్రముఖ శిల్పి సీఎస్‌ఎన్‌ పట్నాయక్‌ కన్నుమూత

ప్రముఖ శిల్పి, చిత్రకారుడు సీఎస్‌ఎన్‌ పట్నాయక్‌(97) గురువారం విశాఖలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా బాదాంలో జన్మించిన ఆయన ఫైన్‌ఆర్ట్స్‌ పూర్తిచేసి గుంటూరులోని

Published : 12 Aug 2022 03:23 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రముఖ శిల్పి, చిత్రకారుడు సీఎస్‌ఎన్‌ పట్నాయక్‌(97) గురువారం విశాఖలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా బాదాంలో జన్మించిన ఆయన ఫైన్‌ఆర్ట్స్‌ పూర్తిచేసి గుంటూరులోని మహిళా కళాశాలలో చిత్రకళల అధ్యాపకుడిగా చేరి ఆ తర్వాత శిల్పకళలపై దృష్టిసారించారు. 1975లో కాంస్య శిల్పకళపై పరిశోధనలు చేయటానికి యూజీసీ ఫెలోషిప్‌ను అందుకున్నారు. పట్నాయక్‌ ఏపీ లలితకళా అకాడమీ ఉపాధ్యక్షుడిగా, భారత శిల్పుల ఫోరం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కార్‌, విశిష్ట పురస్కార్‌, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న బిరుదు, కేంద్ర ప్రభుత్వ వయోశ్రేష్ట అవార్డులు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని