ఉరకలెత్తిన కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 26 గేట్ల నుంచి కృష్ణమ్మ దిగువకు ఉరకలెత్తుతోంది. సాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో గురువారం ప్రాజెక్టు ఉన్నతాధికారులు గేట్లు

Published : 12 Aug 2022 03:15 IST

మాచర్ల, విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 26 గేట్ల నుంచి కృష్ణమ్మ దిగువకు ఉరకలెత్తుతోంది. సాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో గురువారం ప్రాజెక్టు ఉన్నతాధికారులు గేట్లు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఉదయం 5.30 గంటలకు 13వ క్రస్టుగేటు ద్వారా డ్యాం చీఫ్‌ ఇంజినీరు శ్రీకాంత్‌, 14వ గేటు నుంచి డ్యాం ఎస్‌ఈ ధర్మానాయక్‌ నీటిని దిగువకు వదిలారు. 13, 14 గేట్లకు రెండువైపులా ఒక్కో గేటును ఎత్తుతూ మధ్యాహ్నం 2 గంటలకు అన్నింటినీ 10 అడుగుల మేర ఎత్తారు. దీంతో 3,80,016 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. సాగర్‌ కుడి కాలువకు 4,848, ఎడమ కాలువకు 3,431, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2,400, లోలెవల్‌ కెనాల్‌కు 300, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 33,333 క్యూసెక్కుల ప్రవాహాన్ని వదులుతున్నారు. సాగర్‌ నీటిమట్టం 588.00 అడుగుల వద్ద కొనసాగుతుంది. గరిష్ఠ మట్టానికి 2 అడుగుల చేరువలో ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద దిగువకు పోటెత్తుతోంది. కార్యక్రమంలో డ్యాం ఈఈ మల్లికార్జునరావు, డీఈలు పరమేశ్‌, సుదర్శన్‌, సుధాకర్‌, మురళీధర్‌, కోటేశ్వరరావు, డ్యాం ఆర్‌ఐ ఎం.భాస్కర్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని